ఉత్తరాఖండ్‌లో కరోనా కర్ఫ్యూ పొడిగింపు..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 25 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి సుబోధ్‌ ఉనియాల్‌ తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి మే 25 ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధన అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆంక్షలు.. మినహాయింపులివే..

వివాహ వేడకకు హాజరయ్యేందుకు 20 మందికి మించి అవకాశం లేదు. వేడకకు హాజరుకావాలనుకునే వారు విధిగా 72 గంటలకు ముందు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి.

కొవిడ్‌ రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఈ-పాస్‌లను జారీ చేయనున్నారు.

బ్యాంకులు 10 నుంచి 2 గంట వరకే పనిచేస్తాయి. సహా రాష్ట్ర ఆర్థిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇదే నిబంధన వర్తిస్తుంది.