రాబర్ట్ వాద్రాకు కరోనా.. ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దీంతో ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తన భర్త రాబర్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని, తనకు నెగిటివ్‌గా వచ్చిందని, వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌కు వెళుతున్నట్లు ఒక వీడియో సందేశంలో ప్రియాంక తెలిపారు. కాగా, నేడు ఆమె అస్సాంలో పర్యటన చేపట్టాల్సి వుంది. శనివారం తమిళనాడు, ఆదివారం కేరళలో పర్యటించాల్సి వుంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నానని .. ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గెలుపుకు ప్రార్థన చేస్తున్నట్లు ఆ వీడియోలో తెలిపారు.