చిల్లపల్లి ఆధ్వర్యంలో 3వ రోజు జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

మంగళగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 14వ తేదిన 3వ రోజు మంగళగిరి మండలం, నవులూరు పోతురాజు చెరువు దగ్గర ఉన్న టిడ్కో గృహాలను మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించి అక్కడ పరిస్థితులను ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలోనే పూర్తయిన ఇల్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ ఇళ్లకు రంగులు మాత్రమే మార్చుకొని, లబ్ధిదారులకు ఇంకా ఇల్లు కేటాయించకుండా, ఈ వైసిపి ప్రభుత్వం చోద్యం చూస్తుంది. అలాగే నిన్న మంగళగిరి పట్టణంలోని టిడ్కో గృహాలకు వెళ్లి పరిశీలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని, మాకు అన్నీ బాగున్నాయి ఇక్కడ ఏ సమస్యలు లేవని లబ్ధిదారుల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు వాగ్దానవాదం చేశారు. దాదాపు 1700 పైచిలుకు ఉన్న లబ్ధిదారుల్లో మాకు దాదాపు 400 అర్జీలు జనవాణి కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చాయని, వాటి పరిశీలనలో భాగంగా మంగళగిరి టిడ్కో గృహాలకు వెళ్లితే నలుగురు వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రజల తరపున జనసేన పార్టీ పోరాడుతుందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి పేదలకు కట్టించిన ఇళ్లకు వచ్చి ఒకసారి చూసి, వాళ్లకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలో కల్పించాలని, లబ్ధిదారులకు ఇల్లులు తొందరగా కేటాయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జే.ఎస్.ఆర్), మంగళగిరి నియోజకవర్గ నాయకులు చిట్టెఒ అవినాష్,తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శిలు తిరుమలశెట్టి శ్రీధర్, సింగంశెట్టి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల కార్యదర్శి చాముండేశ్వరి, కుంచనపల్లి గ్రామ అధ్యక్షులు మున్నా శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరరావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి కిషోర్, మంగళగిరి నియోజకవర్గ ఐటీ విభాగం కోఆర్డినేటర్ సింగంశెట్టి రాకేష్, మంగళగిరి మండల కార్యదర్శి కట్టా కృష్ణ, బేతపూడి గ్రామ నాయకులు వాసా శివన్నారాయణ, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లీళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి మండల సోషల్ మీడియా కమిటీ సభ్యులు బేతపూడి వంశీ, పెనుమాక గ్రామ జనసైనికులు షేక్ బాషా, షేక్ రెహమాన్, షేక్ సైదా, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.