కరోనా టీకా తీసుకున్నఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా టీకా తీసుకోగా తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో తొలి డోసు వేయించుకోగా సీఎం కేజ్రీవాల్ పేరెంట్స్ కూడా టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తున్నది.

ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి 24 గంటలూ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రజలు వారికి అనుకూలమైన సమయంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.