“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” 39వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆముదాల పాడు గ్రామంలో ఆదివారం “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం 39వ రోజు నిర్వహించడం జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, ఆముదాల పాడు గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు “గాజుగ్లాస్” కి ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా దీవించండి అని కోరారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపూరు నాగేంద్ర, వలిపి శ్రీకాంత్, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.