వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసంతర్పణలో పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, చిత్రాడ గ్రామం నందు వెలమపేటలో వెలమ సంఘం ఏర్పాటు చేసినటువంటి అన్నసంతర్పణ కార్యక్రమానికి కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డా శ్రీధర్ పిల్లా(ఎం.డి జెనరల్ మెడిసిన్) అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నసంతర్పణ నిమిత్తం 5116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.