పిడుగుపాటు బాధితులను పరామర్శించిన డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.మాడుగుల మండలం, బీరం గ్రామపంచాయతీ అనర్బా గ్రామంలో మొన్న శనివారం మధ్యాహ్నం కురిచిన వర్షానికి పిడుగుపాటు కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న లక్ష్మన్ రావు, పార్వతమ్మ మరియు 6 కుటుంబాల గృహ సముదాయాలకు ఈ పిడుగుపాటు కారణంగా నష్టం జరిగింది. సోమవారం బాధిత కుటుంబాలను సందర్శించి వారి కుటుంబాలను పరామర్శించిన అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి ప్రకృతి వైపరీత్యం వలన సాటి గిరిజనులు తుర్రె లక్ష్మణ్ రావు మరియు ఇతర కుటుంబాల గృహాలు దెబ్బతిన్నది. ఇది దురదృష్టకరం 6 గిరిజన కుటుంబాలు నష్టపోయిందనేది వాస్తవం. ఏది ఏమైనా నష్టమైతే జరిగింది ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై స్పందించి ప్రభుత్వం తరపున, ఐటీడీఏ ద్వారానైన సహాయ సహకారాలు ఆ కుటుంబాలకి అందేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక మండల తాసిల్దార్, విఆర్ఓ అధికారులను స్వయంగా బాధితుల సమక్షంలో పోన్ చేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న నాయకులు తల్లే త్రిమూర్తి, సోమన్న, నాగేశ్వరరావు పాల్గొని తమవంతు సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తామని, బాధిత కుటుంబానికి ఇన్చార్జ్ గంగులయ్యతో పాటుగా మేము కూడా అండగా ఉంటామని తెలిపారు.