అడుగడుగునా సమస్యలతో సతమతమవుతున్న ఏలూరు

  • ఎక్కడికక్కడే మురుగునీరు పేరుకుపోయింది..
  • పట్టించుకునే నాథుడే లేడు
  • దక్షిణపు వీధి వేరుశనగ ఫ్యాక్టరీ వద్ద మురుగు డ్రైన్ లో బ్లాక్ అవుతుంది
  • వీటి వలన దోమల బెడద విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు
  • వెంటనే మురుగు డ్రైన్ నీ శుభ్రపరచాలి
  • లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున ధర్నా కు దిగుతామని హెచ్చరించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: నియోజకవర్గంలో అసమర్థుడైన ఎమ్మెల్యే ఉండటం వలన మురుగు డ్రైనేజీల సమస్యలు తలెత్తాయని, డ్రైనేజీ లో ఎప్పటికప్పుడు మురుగు తీయకపోవడం వలన ఆ మురుగు నీరు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. 11వ డివిజన్ దక్షిణపు వీధిలో పర్యటనకు వచ్చిన రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏలూరు నగరంలోని డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని, మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని మేయర్ నూర్జహాన్ని డివిజన్ కార్పొరేటర్ లను ప్రజానీకం అందరూ నిలదీసి ప్రశ్నించాలని సూచించారు. ఏలూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రమత్తులోనే ఉంటున్నారని ఆళ్ళనాని రాజకీయ భవిష్యత్తుకు ఇవే చివరి రోజులు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. 11వ డివిజన్ లోని దక్షిణపు వీధిలో గత 20 రోజులుగా వేరుసెనగ ఫ్యాక్టరీ వద్ద మురుగు డ్రైన్ బ్లాక్ అవడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గంలో వివిధ రకాల పార్టీలు వారు కట్టే ఫ్లెక్సీలను తొలగించడానికి పనిచేసే మున్సిపల్ సిబ్బంది, ఈ చెత్తను మురుగు డ్రైన్ ను శుభ్రపరచడానికి ఎందుకు పనిచేయట్లేదు?? దీనిపై ఎమ్మెల్యే ఆళ్ళనాని, నగర మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ వారు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, మున్సిపల్ అధికారులు సరైన సమయంలో స్పందించకపోతే జనసేన పార్టీ తరపున ధర్నాకు దిగుతామని రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల పరిపాలనా లో ఏలూరు నగరంలో అభివృద్ధి మచ్చుకైన కనిపించలేదని, మళ్ళీ ప్రజలను మభ్య పెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. ఎమ్మెల్యే బండారాన్ని ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో ఆళ్ళనాని పాదయాత్ర చేస్తున్నారని, స్థానిక ప్రజలు మాత్రం ఆళ్ళనాని యాత్రను పట్టించుకోవడం లేదని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే మాటలు ప్రజలు గమనించారన్నారు. ఏలూరులో అభివృద్ధి మచ్చుకైన కనిపించడంలేదని, మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు ఎమ్మెల్యే ఆళ్ళనాని ప్రయత్నిస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మీడియా ఇన్చార్జి జనసేన రవి, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కుర్మా సరళ, తుమ్మపాల ఉమాదుర్గ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, నిమ్మల శ్రీను, నూకల సాయి ప్రసాద్, వంశీ, బొద్దాపు గోవింద్, బుధ్ధా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.