ఆస్ట్రేలియా వార్తల నిలిపివేత నిర్ణయంపై వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్

ఫేస్‌బుక్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. దీంతో తమ వార్తలను నిలిపివేయడంపై వెనక్కి తగ్గిందని అస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ శనివారం తెలిపారు. సిడ్నీలో జరిగిన ఒక సమావేశంలో మారిసన్‌ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌ తిరిగి మాతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంపై తాను సంతోషిస్తున్నానని అన్నారు. ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియా వార్తలను నిలిపివేయడం, దేశీయ, విదేశీ వార్తాసంస్థల పేజీలను తొలగించడం, దేశీయ, విదేశీ వార్తా సంస్థల పేజీలను తొలగించడంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ, అత్యవసర విభాగాల ఖాతాలను కూడా ఫేస్‌బుక్‌ తొలగించడంతో ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. గతంలో వార్తా సమచారాల లింక్‌ల కోసం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్‌, గూగుల్‌ చెల్లించాల్సిన నగదుపై అస్ట్రేలియా కొత్త చట్టాన్ని రూపొందించింది. దీంతో ఆగ్రహించిన ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియా వార్తలను నిలిపివేసింది. కాగా, తాజాగా తమకు ప్రతిపాదిత చట్టంపై వj్యతిరేకత లేదని ఫేస్‌బుక్‌ బహిరంగంగా సూచించింది. దీనిపై మారిసన్‌ స్పందించలేదు. ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌ బర్గ్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధి జోష్‌ ప్రైడెన్‌బర్గ్‌ మాట్లాడారని.. వారాంతంలో మరిన్ని చర్చలు జరుగనున్నట్లు సమాచారం.