కక్ష సాధింపు దాడులు మానుకోవాలి: బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజవర్గ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు రాష్ట్ర మత్స్యకార విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ అన్నారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటం గ్రామ ప్రజలు గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక జరుపుకునేందుకు స్థలం ఇచ్చిన వారి ఇళ్లను కూల్చి వేసి జగన్ తన సైకో తనాన్ని తెలియజేశారన్నారు. అలాగే ఇటీవలే విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన జనవాని కార్యక్రమం జరగకుండా వ్యవహరించారని జనసేన పార్టీ అధినేత పవన్ బసచేసిన హోటల్ ను పోలీసులు చుట్టుముట్టి బయటకు రానివ్వకుండా చేయడమే కాకుండా ఆయనతోపాటు పలువురు నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. దాడులు చేయడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై చూపితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో కూల్చి వేతలు తప్ప అభివృద్ధి శూన్యమని రోడ్లు పరిస్థితి అద్వానంగా మారిందని విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న భీమవరంలోని తాడేరు వంతెన నిర్మాణం కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా పాదయాత్ర చేసిన వారిపై కేసులో పెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఇది ఎంతో కాలం లేదన్నారు. నర్సాపురంలో అభివృద్ధి లేదని డంపింగ్ యార్డ్, రోడ్లను చూస్తే పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేకు తెలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న అభివృద్ధి, ఆర్టీసీ బస్టాండ్ తప్ప మరేమీ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కుడుపై చూపుతున్న శ్రద్ధతో రాష్ట్ర అభివృద్ధి చేయడంలో కూడా చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, ఆకుల వెంకటస్వామి, తిరుమణి సీతామహాలక్ష్మి, పోలిశెట్టి నలిని, తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడి కృష్ణ వేణి, వలవల సావిత్రి, పెమ్మాడి కిరణ్, బొమ్మిడి కృష్ణమూర్తి, నిప్పులేటి తారక రామారావు, పోలిశెట్టి సాంబ, లక్కు బాబి తదితరులు పాల్గొన్నారు.