పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ పోలవరం మండలం, గుత్తెనదీవి గ్రామానికి చెందిన తానింకి సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ శనివారం సత్యనారాయణ కుమారులు ప్రసాద్, బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు గ్రామానికి చెందిన మచ్చా రామకృష్ణ కుటుంబ సభ్యులను పితాని బాలకృష్ణ పరామర్శించారు. వీరి వెంట మద్దింశెట్టి పురుషోత్తం, లంకెలపల్లి జమి, ఇండుగుల రామకృష్ణ, పడాల లక్ష్మణ్, దూడల స్వామి, పితాని రాజు, పెన్నాడ శివ, రాచకొండ ప్రోలరాజు, ఆకేటి వీరేంద్ర, మోర్త అదృష్ట కుమార్, సవరపు బాబ్జి, ప్రసాద్ చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.