రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో చెలరేగిన మంటలు..

రాంచీ-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (స్పెషల్‌ ట్రైన్‌) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మీడియాకు అందిన సమాచారం మేరకు.. రాంచీ-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ గంగా ఘాట్‌ స్టేషన్‌ మీదుగా వెళుతుండగా, వెనుకనున్న నాలుగవ వ్యాగన్‌ నుండి మంటలు రావడాన్ని స్టేషన్‌ సిబ్బంది గమనించారు. వెంటనే రైలులోని సిబ్బందికి సమాచారమిచ్చి స్టేషన్‌లోనే బండిని నిలిపేశారు. వెంటనే రైల్వే ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 25 నిముషాలపాటు మరమ్మతు పనులు పూర్తయ్యాక రైలు ముందుకు కదిలింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని డిఆర్‌ఎం నీరజ్‌ అంబస్ట్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.