కళ్యాణదుర్గం మండల కమిటీల ఏర్పాటు, డంపింగ్ యార్డ్ భూముల పరిశీలన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు ప్రకారం, ఏటీపీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ సూచన మేరకు కళ్యాణదుర్గం మండల కమిటీలు ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అన్ని మండలాల ఫైనల్ లిస్టు రెడీ చేసి జిల్లా అధ్యక్షులకు అందజేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణదుర్గం పట్టణంలో ముదిగల్లు రోడ్డు బైపాస్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కళ్యాణదుర్గం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల పక్కన ఉన్న వ్యవసాయ భూములకు పంట నష్టం జరిగే విధంగా ఉంది అని రైతులు వ్యతిరేకించారు. ఈ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ మద్దతు మాకు కావాలని రైతులు తెలియజేయడం జరిగింది. అందువలన ఆ డంపింగ్ యార్డ్ భూములను పరిశీలించడం జరిగింది. డంపింగ్ యార్డ్ మార్చాలని రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చినా కూడా డంపింగ్ యార్డ్ ను మార్చకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చాలపాడి రమేష్, జనసేన వీర మహిళ షేక్ తార, జనసేన నాయకులు ముక్కన్నా, జాకీర్, కుందుర్పి మంజునాథ్, హర్ష, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.