అంతరిక్షంలోకి అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్..

ఈ మధ్య కాలంలో అంతరిక్షంలోకి వెళ్లే ప్రయాణాల సంఖ్య పెరుగుతోందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం భారత దేశానికి చెందిన బండ్ల శిరీష తన కంపెనీ సిబ్బందితో కలిసి అంతరిక్ష ప్రయాణానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్ ఈ రోజు మొదటి సారిగా అంతరిక్ష ప్రయాణాన్ని చేయనున్నారు. ఈ అంతరిక్ష ప్రయాణం గురించి మనకు తెలియని విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు ప్రముఖ మార్కెటింగ్ డెలివర్ సంస్థ అమెజాన్ కు చీఫ్ గా ఉన్న జెఫ్ బెజోస్ కు బ్లూ ఆరిజిన్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా ఈ రోజు తనతో పాటు తన సిబ్బందిని అంతరిక్ష ప్రయాణానికి తీసుకు వెళ్లనున్నారు. బెజోస్ తో పాటుగా అతని బ్రదర్, మాజీ పైలట్ మరియు ఒక పేయింగ్ కస్టమర్ ఉండబోతున్నట్లు అధికారికంగా తెలియచేశారు. జెఫ్ బెజోస్ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో ఇతను పుస్తకాలను ఒక చిన్న గ్యారేజ్ లో అమ్ముకునే స్థాయి నుండి ఆన్లైన్ లో అన్ని రకాల వస్తువులను అమ్మే ఒక పెద్ద మార్కెటింగ్ మరియు డెలివరీ సంస్థగా ఎదిగాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు బెజోస్ తన అమెజాన్ చీఫ్ బాధ్యతల నుండి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తరువాత మరో ప్రమాదకరమైన నిర్ణయాన్ని తీసుకుని తన అభిమానులను విస్మయానికి గురి చేశాడు. మాములుగా ఈ సంస్థను బెజోస్ రెండేళ్లకు ముందుగానే స్థాపించాడు. ఇతను రిచర్డ్ బ్రాన్సన్ తో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాడు. కొద్ది రోజుల క్రితం బ్రాన్సన్ తన బృందంతో అంతరిక్షం అంచు వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. బ్లూ ఆరిజిన్ కంపెనీ యొక్క కొత్త షెఫర్డ్ ఫ్లైట్ జెఫ్ బెజోస్ బృందాన్ని కర్మన్ రేఖకు మించి వెళ్లనుందని తెలుస్తోంది. అంతే కాకుండా వీరు భూమికి 100 కిలోమీటర్ ల దూరం వరకు ప్రయాణించనున్నారు. అక్కడి నుండి వీరంతా పారాచూట్ సహాయంతో బ్లూ ప్లానెట్ పైకి వెళ్లి అక్కడి సుందర దృశ్యాలను వీక్షిస్తారు.

ప్రస్తుతం జెఫ్ బెజోస్ బృందం ఈ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారు. ప్రయాణానికి సంబంధించి బ్లూ ఆరిజిన్ కంపెనీ పర్యాటకులకు ఒక సూచన చేసింది. భద్రతకు మన కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఫ్లైట్ ఎగరనుంది. లిఫ్ట్ అఫ్ గురించి ఫ్లైట్ డైరెక్టర్ స్టీవ్ లానియస్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా సక్రమంగానే ఉంది. ఫ్లైట్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఈ ప్రయాణం కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఉన్నామని డైరెక్టర్ అరియాన్ కార్నెల్ తెలిపారు. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ అంతరిక్ష ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జరగాలని ఆశిద్దాం. “ఆల్ ది బెస్ట్ టీమ్ అఫ్ బ్లూ ఆరిజిన్”.