నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాలు వాయిదా

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాలు వాయిదాపడ్డాయి. ఈ నెల 8, 9 తేదీల్లో నాగబాబు నెల్లూరు జిల్లా సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే 9వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమైన సమావేశం ఉండడంతో ఈ సమావేశాలను వాయిదా వేశారు. తిరిగి సమావేశాలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తారు.