భైంసా పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు

  • దేశం ఏదైనా కార్మికులే జీవనాధారం
  • మేడే శుభాకాంక్షలు

భైంసా: మేడే సందర్భంగా భైంసా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుంకేట మహేష్ బాబు, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు, దేవిదాస్ హస్డ్ వంచిత్ బహుజన్ అగాడి జిల్లా నాయకులు వారు మాట్లాడుతూ.. మేడే కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టడం సరైంది కాదు. ఇది ప్రతి కార్మికుడి దృఢ సంకల్పం, ఎంతో మంది ప్రాణత్యాగాల నుంచి కేవలం వారి హక్కుల కోసమే ఉద్భవించింది. వస్తువుల తయారీకి మనుషుల స్థానంలో మెషీన్లు వచ్చాక కార్మికులకు పని సులువు అయ్యింది. ముఖ్యంగా మన చుట్టూ ఉండే కార్మికులంటే చాలా మందికి చిన్నచూపు వారే లేకపోతే ఇంతటి ప్రశాంతమైన జీవితం సిద్ధించేది కాదు. ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఓ కార్మికుడి శ్రమ ఆధార పడి ఉంది. నిద్ర లేవక ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే సఫాయి కార్మికులు, ఆటో కార్మికులు, తదితర కార్మిక వర్గం మానవుడి సౌకర్యవంతమైన జీవితంలో సమాజ గతిని పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. అయితే ఎన్నికల ముందు వారికి ఇచ్చే హామీలేవీ నెరవేరడం లేదు. హక్కులు కాపాడుకోవడం కోసం మళ్ళీ పోరాటం చేయవలసిన అవసరం వుంది. మే1న జరిగిన పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు వదిలినవారి త్యాగం ‘మేడే’ కి పునాది వేసిందని గుర్తుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, రాజు, అక్రం, భూమేష్, భోజన్న, దేవన్న తదితరులు పాల్గొన్నారు.