తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..!

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల సమాధానాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు ఎందుకు పెంచడం లేదన్న హైకోర్టు ప్రశ్నకు బదులుగా రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని హెల్త్ అఫీసర్ శ్రీనివాస్ రావు కోర్టుకు తెలిపారు. దీంతో ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదన్న హైకోర్టు, నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడింది. నైట్ కర్ఫ్యూ పెట్టిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నిస్తూ. లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తెలంగాణలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని ప్రశ్నించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉందన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామని, అయితే, తమిళనాడు నుండి రావాల్సిన 55 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ రాలేదని తెలిపారు.