అక్రమ రోడ్డు నిర్మాణాలను ఆపాలి..

కురుపాం నియోజకవర్గం: గరుగుబిల్లి మండలం కొంకుడువరం గ్రామం పంచాయతీ కొంకుడువరం గ్రామానికి అనుకోని ఉన్న చినగుడవ, పెద్ద గుడవ, గదవల గ్రామాలకు కొండలను ఆనుకోని కొండ పోరంబోకు ప్రాంతంలో 2 కోట్లు ఎన్ఆర్జేసీ నిధులతో రోడ్లను వేస్తున్నారు. అక్రమ మైనింగ్, లైసెన్సు లేని తారు ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ప్రజలు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, అక్కడ ప్రజలు క్వారీలు, తారు ఫ్యాక్టరీ లతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం తెలుసుకుని రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు చినగుడబా నుండి కొంకుడువరం వరకూ అక్రమంగా వేస్తున్న రోడ్డును అడ్డుకొని కొంకుడువరం, చినగుడబా, పెద్దగుడబ, గదభవలస గ్రామ ప్రజలతో ధర్నా చేయడం జరిగింది.. ఈ రోడ్డుని తారు ఫ్యాక్టరీ ఇక్కడితో ఆపకపోతే సోమవారం జరిగే కలెక్టర్ ఆఫీస్ స్పందన కార్యక్రమంలో ఈ 4 గ్రామ ప్రజలతో కలిసి కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరించడం అయినది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్, కురుపాం నియోజకవర్గ విజయనగరం జిల్లా జనసేన కార్య నిర్వహణ కార్యదర్శి గౌరీ శంకర్, పార్వతీపురం నియోజకవర్గం జనసేన నాయకులు గణేష్, కర్రి మణికంఠ ఈ కొంకుడువరం పంచాయతీ గ్రామ సర్పంచు అప్పలనాయుడు, చిన గుడబ, పెద్ద గుడబ గడవలస గ్రామాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.