IRCTC కొత్త రూల్స్..

రోజురోజుకి రైల్ టికెట్ దొరకడం ఎంతో కష్టతరంగా మారిపోతుంది. నేడున్నసమయంలో ట్రైన్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే సీట్లు ఫీల్ అయిపోవడం టిక్కెట్లు లేకపోవడం కనపడుతుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో అయితే మరింత కష్టంగా ఉంటుంది. అయితే మూడు నెలల ముందే ఐఆర్సీటీసీ రిలీజ్ చేసిన టిక్కెట్లు 48 గంటల్లో పూర్తి అయిపోతున్నాయి. అయితే ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్ తో నేటి నుండి ఈ కథ మార నుంది.

సాధారణంగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే దాదాపు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). అయితే తాజాగా ఐఆర్‌సీటీసీ కొత్త రూల్ తీసుకువచ్చి.. రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై ట్రైన్ బయలు దేరడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇందుకోసం ట్రైన్ బయలు దేరడానికి అర గంట ముందే రెండో రిజర్వేషన్ చార్ట్‌ను విడుదల చేస్తారు. దీంతో ట్రైన్‌లో ఏమైనా ఖాళీ ఉంటే ఆ సీట్లను ప్రయాణీకులు బుక్ చేసుకోవచ్చు. అయితే వాస్తవానికి ఈ వెసులుబాటు ఇంతక ముందు కూడా ఉండేది. కానీ, కరోనా వల్ల ఈ సర్వీస్‌ బంద్ అయ్యాయి.

అయితే ఇప్పుడు కరోనా కాస్త నెమ్మదించడంలో.. మళ్లీ పాత సర్వీసును ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై రెండో రిజర్వేషన్ చార్ట్‌ను మళ్లీ 30 నిమిషాల ముందుగానే రెడీ చేస్తున్నామని తెలిపిన ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా పీఆర్ఎస్ కౌంటర్లలో టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది.