జనసైనికులకు జనసేన అండగా ఉంటుంది: కిల్లో రాజన్

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీది మండలం పూజరి పాకలు గ్రామవాసి వంతల చందర్రావు గత పది రోజుల క్రితం మిరియాలు సేకరణ చేస్తూ అదుపుతప్పి చెట్టునుంచి జారిపడిపోవడంతో ఎడమ చేయి భుజం దగ్గర విరిగిపోయింది. దీంతో హుటాహుటిన విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కి క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం తరలించడం జరిగింది. నేటికి 10 రోజులు గడిచిన కూడా సరైన వైద్య సదుపాయం అందక జాప్యం జరగడంతో జనసైనికుడు క్షతగాత్రుడి కుమారుడు వంతల ప్రసాద్ పాడేరు జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన పాడేరు నియోజకవర్గం జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ రాజన్ సంబంధిత వైద్యులను సంప్రదించి తక్షణమే క్షతగాత్రుడిని ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా వైద్యులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకునేలా చేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చెయ్యడానికి తమవంతు కృషి చేసారు. దీంతో జనసైనికుడు వంతల ప్రసాద్ కుటుంబీకులు జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందుకు రాజన్ స్పందించి మానవతా సహాయంగా కొంత నగదు ఇచ్చారు ఈ సందర్బంగా రాజన్ మాట్లాడుతూ జనసైనికులు ఎటువంటి కష్టాల్లో ఉన్నా మేము అందుబాటులో ఉంటే మాత్రం కచ్చితంగా స్పందిస్తామని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యం కోల్పోవద్దని జనసేన కుటుంబానికి విషయం తెలియజేయాలని రాజకీయ మార్పుతో పాటుగా అధినేత పవన్ కళ్యాణ్ చూపిన సేవభావం కూడా జనసైనికుల సొంతమని గిరిజన ప్రజలు గుర్తించాలని తెలిపారు.