ఓటీఎస్ పై జనసేన అవగాహన సదస్సు

పాడేరు మండలం బడిమేల పంచాయితీ, బడిమేల గ్రామంలో జరిగిన సభలో ఈ మధ్య ఓటీఎస్ అనే గృహ హక్కు పత్రాల కోసం ప్రభుత్వం చేస్తున్న అరాచకం, దోపిడీ దారి వ్యవస్థ గురించి ప్రజలను చైతన్య పరుస్తూ ప్రసంగించిన అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ శ్రీ వంపురు గంగులయ్య. ఈ సమావేశంలో గ్రామ యువత, పెద్దలు, పాడేరు మండలం జనసేన వీరమహిళలు విభాగం నేత శ్రీ మతి శ్రీ కిట్లఒగి పద్మ, మండల జనసేన అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు కిల్లో అశోక్ కుమార్, జీ మాడుగుల మండలం జనసేన ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ, యూత్ అధ్యక్షులు, పవన్ ఉపాధ్యక్షులు పొతురాజు గంగ ప్రసాద్, బడిమేల యూత్ జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ నాయుడు, ఉపాధ్యక్షులు వంతల ఈశ్వర్ నాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు.