కూకట్పల్లిలో జనసేన-బిజేపి ప్రచార హోరు

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి.హెచ్.బి, ఫేస్-1లోని ధర్మారెడ్డి కాలనీ, జేఎన్టీయూ, శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నుండి శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించి 5వ ఫేస్ వరకు బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

  • కల్వరి టెంపుల్ ఫౌండర్ డాక్టర్ పి.సతీష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముమ్మారెడ్డి

తెలంగాణ, ప్రముఖ దైవజనులు కల్వరి టెంపుల్ ఫౌండర్ డాక్టర్ పి.సతీష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా మియాపూర్ కల్వరి టెంపుల్ లో కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆయనను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది.