దుర్గాడ గ్రామంలో జనసేన పార్టీ గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామం జనసేన పార్టీ గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం జ్యోతుల శ్రీనివాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశము నందు ప్రచార కార్యక్రమం, పోలింగ్ విధానం, ఇతర విషయాలపై దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లప్రోలు మండల ప్రచారం కమిటి సభ్యులు, దుర్గాడ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు దుర్గాడ ఎన్నికల నిర్వహణ గూర్చి మాట్లాడి తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన దుర్గాడ గ్రామానికి సంబంధించి జ్యోతుల శ్రీనివాసు అధ్యక్షతన గ్రామ జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పని చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. దుర్గాడ గ్రామంలో గల 7 పోలింగ్ బూతులకు కమిటీలు ఏర్పడి సదరు బూతుకమిటీలు జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో పనిచేసి పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న జనసేనాని & జనసేనపార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి దుర్గాడ గ్రామ ఓటరులను జాగృతం చేసి గ్లాసుగుర్తు ఓటు వేయించి కొణిదెల పవన్ కళ్యాణ్ కి మేము సైతం అనే విధంగా తగు మెజార్టీని ఇవ్వాలని మండల ప్రచారం కమిటి సభ్యులు, దుర్గాడ గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు సభ ముఖంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రచార కమిటీ సభ్యులు గొల్లపల్లి శివబాబు,ఇంటి వీరబాబు, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ కందా శ్రీనివాస్, శాఖ సురేష్, ఉమ్మడి బోడకొండ వెలుగుల శ్రీనివాసు{సతీష్}, దడాల రాజుబాబు, దుర్గాడ గ్రామ జనసేన నాయకులు మేడిబోయినసత్యనారాయణ, గుండ్రా నానాజీ, కొమ్మూరి కృష్ణ, అరట్లకట్ల నాగరాజు, నేమాల వీరబ్బాయి, జీలకర్ర కృష్ణ, రావుల తాతారావు, గాది చంద్రరావు, జీలకర్ర కాపు,
జ్యోతుల సీతరాంబాబు, ఆకుల అర్జున్, గొల్లపల్లి శ్రీనివాస్,
మొగిలి శ్రీను, సఖినాల రాంబాబు, కాకినాడ శివ, కొప్పుల చక్రధర్, జ్యోతుల వాసు, యండపల్లి నరేష్, పోలం త్రిమూర్తులు, కాపారపు వెంకటరమణ,పొన్నగంటి శ్రీను, చేశెట్టి భద్రం, జ్యోతుల గొపి, సాదనాల చంటిరాము, మంతెన గణేష్, కొరకుప్ప కొండబాబు, జ్యోతుల వీరబాబు, కొలా నారాయణరావు, నేమాల కన్నయ్య, ములగపాటి ప్రకాష్, పదపాటి అప్పలస్వామి, విప్పర్తి శ్రీను, శివకొటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.