దుర్గాడ గ్రామంలో మేడే దినోత్సవ వేడుకలు

పిఠాపురం నియోజవర్గం: ప్రపంచ కార్మికదినోత్సవం{మేడే} సందర్భంగా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో గల విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు & జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసుని ముఖ్యాతిధిగా, విశిష్ట అతిధిగా జనసేనపార్టీ రాష్ట్ర నాయకురాలు డి కె చైతన్యలను ఆహ్వానించారు. దుర్గాడ గ్రామ విజయదుర్గ భవననిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్యాతిథిగా జ్యోతుల శ్రీనివాసు, విశిష్ట అతిధిగా జనసేనపార్టీ రాష్ట్ర నాయకురాలు డి కె చైతన్య ముందుగా ఆటో స్టాండ్ వద్ద ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయదుర్గ భవననిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన కేకు కట్ చేసిన అనంతరం సభలో విశిష్ట అతిధి జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు డి కె చైతన్య మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ…. కార్మికులకు గల హక్కులను తెలియజేసారు… వారి భవిష్యత్తులో భవన నిర్మాణకార్మికులు తగు భరోసా ఇచ్చారు,ముఖ్యాతిధి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఈరోజు మే డే సందర్భంగా దుర్గాడ గ్రామం నందు విజయదుర్గ భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన మేడే దినోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా గర్వపడుతున్నాని, కారణం ఏమిటి అంటే మేడే అనేది కార్మికులుగా పనిచేసే వారికి రోజుకు 08-00 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలని, 08-00 గంటలు వినోదం, మిగిలిన 08-00 గంటలు నిద్ర ఉండాలని షికాగోలోని 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారని పోరాటానికి మద్దతుగా 4రోజుల తరవాత హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారని.కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయి ఉద్యమానికి అంజ్యం పోసారు.” తరువాత ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానం ప్రవేశపెట్టడం జరిగింది.దీని కారణంగానే నేడు కార్మికులకు ఒక రోజులో 8 గంటల మాత్రమే పనిని చెబుతున్నారు. అదనంగా పని చేస్తే బోణసుగా అదనంగా వేతనం చెల్లిస్తూన్నారని తరువాత కాలంలో 8 గంటల పనితో పాటు ప్రతి కార్మికుడి ప్రాణానికి భరోసా ఇవ్వాలని ఇన్సూరెన్స్, వైద్య సదుపాయం మరియు కార్మికుల పిల్లలకు పాఠశాలల నిర్మాణం తదితర హక్కుల్ని సాధించడం జరిగిందని తెలియజేశారు. కార్మికులు సంఘటితంగా ఉండటం వల్ల వారు హక్కులు పొందుతున్నారు. అదేవిధంగా దుర్గాడ గ్రామంలో విజయదుర్గ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ యొక్క భవననిర్మాణ సంఘాన్ని స్థాపించుకోవడం జరిగిందని ఇది చాలా మంచి కార్యక్రమని అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారు స్థలం కేటాయించిన లేదా స్థలం ఎవరైనా దాతలు ఇచ్చినట్లయితే నేను దుర్గాడ గ్రామంలో భవన నిర్మాణ కార్మికులకు ఒక కార్యాలయం నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తరువాత కాలంలో కార్యాలయ స్థానే భవన నిర్మాణం కూడా చేపడతానని మీ అందరికీ స్పష్టమైన హామీనిస్తూన్నాని, భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైన సహాయ, సహకారాలు కావలసిన నాకు సకాలంలో తెలియజేస్తే నేను ముందుండి వారికి తగు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభ ముఖంగా తెలియజేస్తూన్నాని భవన నిర్మాణ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ భవననిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆకుల అర్జునరావు, వైస్ ప్రెసిడెంట్ గట్టెం వీరబాబు, సెక్రటరీ శఖినాల ప్రసన్న, జాయింట్‌ సెక్రటరీ గొల్లపల్లి అయ్యన్న, టెజరర్ తీడ గంగబాబు, కార్యవర్గసభ్యులు వెలుగుల శివబాబు, గుల్లా ఏసురత్నం, సోర్నపూడి వీరబాబు, గుండ్ర త్రిమూర్తులు తదితర విజయదుర్గ భవననిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.