పక్షవాతానికి గురైన వ్యక్తికి వీల్ చైర్ అందజేసిన జనసేన

పిఠాపురం, ఉప్పడా అమినాబాద్ కు చెందిన స్థానికంగా ఉంటున్న పల్లెటి అప్పారావు పక్షవాతానికి గురై తన సొంత పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉండగా ఈ విషయాన్ని పిఠాపురం జనసేన నాయకులు కందరడా ఎంపీటీసీ పిల్లా సునీత వెంకట దినేష్ కి స్థానిక జనసైనికులు తెలియపరచగా వెంటనే స్పందించి ఒక వీల్ చైర్ ను వారి తల్లిదండ్రులు సమాక్షంలో అందించటం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం జనసేన నియోజకవర్గ నాయకులు ద్ర్డా.పిల్లా శ్రీధర్, కాంబల దాసు, బప్పన్న దొర, వంక కొండబాబు, రాజు, ఇజ్రాయెల్, గంజి గోవిందరాజులు, వాకపల్లి సూర్యప్రకాష్, రామిశెట్టి సూరిబాబు, బీజేపీ నాయకులు పిల్ల ముత్యాలరావు, సంఖ్యలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.