అప్పుడు ‘అమ్మ ఒడి‘… ఇప్పుడు ‘అమ్మకానికో బడి‘..

అప్పుడు ‘అమ్మ ఒడి‘
ఇప్పుడు ‘అమ్మకానికో బడి‘

AP ప్రభుత్వాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో విమర్శలు చేశారు. ఎయిడెడ్ స్కూళ్లపై ప్రభుత్వం నిన్న జారీ చేసిన 4 GOలను ఉద్దేశించిన పవన్.. ‘అప్పుడు అమ్మఒడి. ఇప్పుడు అమ్మకానికో బడి. ప్రభుత్వ నిర్ణయంతో 2200 AIDED స్కూళ్లు, 2 లక్షల మంది విద్యార్థులు, 6700మంది టీచర్లు, 182 ఎయిడెడ్ కాలేజీలు, 71 వేల విద్యార్థులు, 116 డిగ్రీ కాలేజీలు, 2.5లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది’ అని తెలిపారు.

1) ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు నాలుగు అవకాశాలను ఇస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 12 న ఓ సర్కులర్ (Circular Memo No 1072635/CE/A1/2020) జారీచేసింది.

2) ఈ విధాన నిర్ణయం 2,200 స్కూళ్లను, 2 లక్షల మంది విద్యార్ధులను, 6,700 మంది ఉపాధ్యాయులను; 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను, దాదాపు 71 వేలమంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను, దాదాపు రెండున్నర లక్షలమంది విద్యార్థులను ఇబ్బందులపాలు చేసింది.

విద్యార్ధులు, సిబ్బందితోపాటు వారి కుటుంబాలను సైతం అతలాకుతలం చేసింది.

3) ఇందులో విద్యాసంస్థలు, విద్యార్థులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్న అంశాన్ని YCP ప్రభుత్వం మరచింది. విద్యార్థుల భవిషత్తును పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ నిర్ణయంతో
విద్యార్థులే బలిపశువులుగా మారారు.

విద్యార్థుల విషయంలో వారి భవిషత్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించింది?

4) వీటిలో ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పని చేస్తున్నాయి? ఈ అంశాలపై ఎస్.ఎమ్.సి.లు తమ తమ సమావేశాల్లో చర్చించాయా? అసలు ఈ పాఠశాలల్లో కమిటీలు లేని పక్షంలో ఈ నిర్ణయానికి విలువ ఉందా? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్టు కాదా?

5) ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీనపర్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా సమయంకాని సమయంలో ప్రభుత్వం ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

6) నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశముంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం,సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో YCP ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

7) మూసివేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు సంవత్సరం మధ్యలోనే తరలిస్తారా? ఇది వారి విద్యాసంవత్సరానికి అంతరాయం కలిగించదా? వారి చదువుకు అంతరాయం కాదా?

8) డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాలలను, కళాశాలలను స్వాధీనపరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనేముందు టీచర్లను, లెక్చరర్లను నియమించాలన్న ఆలోచన మీకు రాలేదా? అని జన సేనాని ప్రశ్నించారు.