తిరుపతిలో జనవాణికి సమస్యల వెల్లువ

•415 అర్జీలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
•సామాన్యుడి గళాన్ని వినిపించేందుకే జనవాణి-జనసేన భరోసా
•రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది
•ప్రతి సమస్యకు జనసేన పార్టీ పరిష్కారం కనుగొంటుంది
•తిరుపతి జనవాణి ముగింపు కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

సామాన్యుడి గళాన్ని బలంగా వినిపించాలనే సదుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో 415 అర్జీలు వచ్చాయని, చిత్తూరు జిల్లా నుంచి 280, అనంతపురం జిల్లా నుంచి 79, నెల్లూరు జిల్లా నుంచి 23, కడప జిల్లా నుంచి 18, కర్నూలు జిల్లా నుంచి 15 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందని అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమం అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ… “ పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్తే పరిష్కారమవుతుందనే నమ్మకంతో చాలా మంది చాలా దూరం ప్రయాణించి వచ్చి అర్జీలు ఇచ్చారు. వచ్చిన 415 అర్జీల్లో… వ్యవసాయ శాఖకు సంబంధించి 54, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, పంచాయతీ రాజ్ శాఖ 43, ఆరోగ్య శాఖ 28, రోడ్లు భవనాలు, మున్సిపాల్ శాఖ నుంచి 49, ఉన్నత విద్యాశాఖ 15, గృహ నిర్మాణ శాఖ 13, టూరిజం శాఖకు సంబంధించి 10, దివ్యాంగులకు సంబంధించి 17 ఉన్నాయి.
•ప్రసూతి ఆస్పత్రిని మున్సిపల్ కార్యాలయంగా మార్చేశారు
రాయలసీమ ప్రాంతానికి మెడికల్ హబ్ గా ఉన్న తిరుపతిలో వైద్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసూతి ఆసుపత్రిని మున్సిపల్ కార్యాలయంగా మార్చేశారని అర్జీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల కబ్జాలు, ఎర్ర చందనం అక్రమ రవాణాలపై ఫిర్యాదులు అందాయి. టీటీడీ నిధులు దుర్వినియోగం, దర్శన టికెట్లు అమ్ముకోవడంపై అర్జీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా గూడూరులో అక్రమ సిలికాన్ మైనింగ్ చేస్తూ స్థానిక నేతలు కోట్లు కొల్లగడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిని ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దర్గా భూముల కబ్జా, నేత్ర సుగర్ ఫ్యాక్టరీ బకాయిల సమస్య, తిరుపతి, చంద్రగిరి, హిందూపురం మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల సమస్యలపై అర్జీలు అందాయి. చెరువులను అక్రమించి డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్థం చేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారు.
•త్వరలో చిత్తూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర
కౌలు రైతు ఆత్మహత్యలపై ఒక మహిళ నుంచి అర్జీ వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా నష్టపరిహారం ఇవ్వలేదని ఆమె వాపోయారు. త్వరలోనే చిత్తూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపడతాం. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. నిన్న కడప జిల్లాలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, పార్టీ నాయకులు వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్, పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజరెడ్డి, పార్టీ నాయకులు రాందాస్ చౌదరి, తాతంశెట్టి నాగేంద్ర, సయ్యద్ ముకరం చాంద్, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి ఆరణి కవిత, లీగల్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *