న్యూజిలాండ్‌ ప్రధానిగా జెసిండా ఘన విజయం

న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా జెసిండా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. జెసిండా సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో 120 సీట్లకు గాను 64 సీట్లను సాధించింది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ చరిత్రలో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది లేదు.. ఇప్పటివరకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. 70శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్‌ ఓటమిని అంగీకరించడం గమనార్హం.  కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో దూకుడుగా వ్యవహరించిన ఆమెకు అక్కడి ప్రజలు రెండోసారి ఘన విజయం అందించారు. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మొదలుపెట్టిన 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.