CSK vs DC: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్‌-13లో ఈ రోజు మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. 8 మ్యాచ్‌లు ఆడి ఏకంగా ఏకంగా ఆరింట్లో విజయకేతనం ఎగరవేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్‌లాడి మూడింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం ఐదింట్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బలీయంగా ఉన్న ఢిల్లీని ఓడించాలంటే ఈరోజు చెన్నై శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.