పెద్ద పండుగగా పెద్ద తాడివాడ వైసీపీ నుండి కూటమిలోకి చేరికలు

  • వరుస చేరికలతో వైసీపీ నాయకుల గుండెల్లో మొదలైన గుబులు

నెల్లిమర్ల నియోజకవర్గం: డెంకాడ మండలంలోని పెద్ద తాడివాడ పంచాయతీ అధికార వైసీపీ పార్టీ నుండి జనసేన తెలుగుదేశం పార్టీలలోకి భారీ చేరికలతో పెద్ద తాడివాడలో జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఈ చేరికలలో భాగంగా జనసేన పార్టీలోకి రామ్మూర్తి, చిన్న రాము వారి అనుచర వర్గం మరియు తెలుగుదేశం పార్టీలోకి చిరంజీవి రాజు వారి అనుచర వర్గం ఎంతో అట్టహాసంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరందరికీ పెద్ద తాడివాడ ప్రజల సమక్షంలో జనసేన, తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం డెంకాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లె భాస్కర రావు సభ అధ్యక్షతన ఘనంగా మొదలయ్యి వివిధ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ప్రసంగాలు కార్యకర్తల కేరింతలతో పెద్ద తాడివాడ దద్దరిల్లేలా ముగిసింది. ఈ సభలో జనసేన తెలుగుదేశం బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలన్నీ అభివృద్ధి దిశలో దూసుకుపోతుంటే గత ఐదేళ్లగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలై, సంక్షేమానికి కూడా పూర్తిగా నోచుకోకుండా, అభివృద్ధి లేకుండా ఎంతోమంది యువత భవిష్యత్తుని కాలరాస్తున్న, శ్రీ జగన్మోహన్ రెడ్డి వారి ఎమ్మెల్యేల మీద లోకం మాధవి గారు ధ్వజమెత్తారు. బొడుకొండ వల్ల గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి నెల్లిమర్ల నియోజకవర్గం లో జరగలేదని, కొండ కనిపించిన సెంటు భూమి కనిపించిన వదిలిపెట్టడని గత 5 ఏళ్లలో ప్రజలలో తిరగకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా 2019 ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా శ్రీ బడుకొండ అప్పలనాయుడు ఇప్పుడు వచ్చి ఓట్లు అడగడం ఏంటి అని మాధవి గారు మండిపడ్డారు.అలాగే రాష్ట్రంలో వచ్చేది జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి ప్రభుత్వమేనని, నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి గారిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్క నాయకుడిని ప్రజలని కోరడం జరిగింది. ప్రజలు హర్షద్వానాలతో కచ్చితంగా నెల్లిమర్లలో ఎగిరేది జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి జెండానేనని, మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని ప్రతి ఒక్కరూ హర్షద్వానాలతో వారి కేరింతలతో వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుని ప్రజలలోకి తీసుకొని వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. ఒక విద్యావేత్తగా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి మహిళ మన నియోజకవర్గంలో శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయడం ఎంతో హర్షించాల్సిన విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి ఐ.వి.పి రాజు, ఇచ్ఛాపురం నియోజకవర్గం అబ్జర్వర్ సువ్వాడ రవి శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, డెంకాడ మండలం పార్టీ అధ్యక్షులు పల్లె భాస్కర్ రావు, విజయనగరం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కలిదిండి పాణిరాజు, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి గేదల రాజారావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు పడాల చిన్నారావు, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ రాజ్, సర్పంచ్ పతివాడ శ్రీను తదితరుల, పైలా శంకర్ అట్టాడ ప్రమీల తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.