వరద ఉదృతి కారణంగా జూరాల గేట్లు ఎత్తివేత

కృష్ణా నదికి వరద ఉదృతి పెరిగింది. ఎగువ నుంచి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఇప్పటికే డ్యామ్‌ పూర్తిగా నీటితో నిండుకుంది. ఈ క్రమంలో వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,10,200 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 11 గేట్లు ఎత్తివేసి 1,12,285 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,044 అడుగుల మేర నీరు ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 9.275 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు.