జనసేన జెండా చూస్తేనే భయపడుతున్నారు

•జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మెను కూల్చి వైసీపీ తన భయాన్ని బయటపెట్టుకొంది
సైద్ధాంతిక బలంతో…. జన క్షేమం కోసం ప్రజల్లో ఉన్న జనసేన పార్టీ పేరు చెప్పినా, జనసేన జెండా ఎగురుతున్నా వైసీపీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోనే నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజల తరఫున నిలబడుతున్నారు. రెపరెపలాడుతున్న జనసేన జెండా చూస్తే అధికార పక్షంవాళ్లు భయపడుతున్నారు. కాబట్టే జగ్గయ్యపేట నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను అర్థరాత్రి సమయంలో జేసీబీతో కూల్చి వేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ శ్రేణులు జెండాలు ఎగురవేసి, తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియచేస్తుంటాయి. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయనడానికి జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మెను దౌర్జన్యంగా కూల్చివేయడమే ఒక నిదర్శనం. జనసేన అంటే వైసీపీకి ఎంత భయం ఉందో స్థానిక శాసనసభ్యుడు, ఆయన అనుచరుల తీరుతో బయటపడింది. ఈ ఘటనపై నిరసన తెలిపిన జనసేన పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయించి తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంది. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నేతలు శ్రీ బొలియాశెట్టి శ్రీకాంత్, శ్రీమతి రావి సౌజన్య, శ్రీ ఈమని కిషోర్, శ్రీ బాడిస మురళీకృష్ణలపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. పార్టీ ఆదేశాల మేరకు జనసేన నాయకులు శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ పి.ఆర్.కె.కిరణ్, శ్రీ గరికపాటి ప్రసాద్, శ్రీ కాకాని లోకేష్, శ్రీ స్టాలిన్ శంకర్ తదితరులు జగ్గయ్యపేట జనసేన శ్రేణులకు అండగా నిలిచారు. ఈ ఘటనపై ఇప్పటికే కృష్ణా జిల్లా, విజయవాడ నగర నాయకులతో చర్చించాం. ధైర్యంగా నిలవాలని, జగ్గయ్యపేట నాయకులు, కార్యకర్తలకు అవసరమైన అండదండలను పార్టీ ఇస్తుందని తెలియచేశాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జెండాలు ఆవిష్కరిస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి అధికార పక్షం ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామిక పద్ధతిలో ఎదుర్కోండి అని శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *