టాస్‌ గెలిచిన కోల్‌కతా.. ఢిల్లీ బ్యాటింగ్‌

ఐపీఎల్ 2020లో భాగంగా నేడు లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్న మైదానమైన షార్జా వేదిక ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఇరు జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో వచ్చాడు. కోల్‌కతాలో కుల్దీప్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అవకాశం దక్కించుకున్నాడు.

వరుసగా రెండు విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో దెబ్బతిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు కోసం పట్టుదలగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడగా 13-10తో కేకేఆర్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యం చెలాయించాలని కార్తీక్ సేన భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ ఉంది.