కోనసీమ టీడీపీ అభ్యర్థులకు బి-ఫారం లు అందజేత

కోనసీమ జిల్లా: డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీమజిల్లా, తెలుగుదేశం అభ్యర్థులకు బి -ఫారం లు అందచేశారు. అమలాపురం పార్లమెంట్ ఎంపి, ఐదు అసెంబ్లీ అభ్యర్ధులకు బి ఫారంలు అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), గంటి హరీష్ మాథుర్ (అమలాపురం ఎంపి అభ్యర్ధి), బండారు సత్యానందరావు (కొత్తపేట), వాసంశెట్టి సుభాష్ (రామచంద్రపురం) లు బి ఫారం లు అందుకున్నారు.