కార్పొరేటర్లకు KTR సీరియస్ వార్నింగ్

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల నేపథ్యం లో ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సిద్దంగా ఉండాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గెలుపోటములపై సర్వే చేయించిన టీఆర్ఎస్.. వీక్‌గా ఉన్న డివిజన్లపై దృష్టి పెట్టారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేటీఆర్ నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కేటీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులుకార్పోరేటర్ల తో భేటీ అయ్యారు.

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పక్కాగా విజయం సాధిస్తామని మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. దానికి తగ్గట్లే టీఆర్ఎస్ అధిష్టానం సర్వే చేయించింది. అయితే.. 15 డివిజన్లలో కాస్త ఇబ్బంది ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో. ఆ 15 డివిజన్ల కార్పొరేటర్లకు తాజా సమావేశంలో కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. పని తీరు బాగోలేనందున మార్చుకోవాలని.. లేకుంటే.. మరోసారి టికెట్ ఇవ్వడం కష్టమనే సంకేతాలిచ్చారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే.. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని సుతిమెత్తగా చురకలంటించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్‌లో పట్టు సడలనీయకూడదని భావిస్తున్న కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌లతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యుహాలు, చేసిన పనుల గురించి ప్రస్తావించాలని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.