కూకట్ పల్లి జనసేన నాయకులతో సమావేశం

తెలంగాణ, కూకట్ పల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులతో వైష్ణవి గ్రాండ్ హోటల్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమవేశంలో భాగంగ ఈ 10 రోజులు నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు మీ మీ డివిజన్ లోనే పూర్తిస్థాయిలో ఉండాలి అని పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, ప్రోటోకాల్ చైర్ పర్సన్ మలినీడి బాబీ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, పార్టీ సీనియర్ నాయకులు యాతం నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు మరియు జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్, పి.చంద్ర మోహన్ మరియు కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.