ఎన్ డి ఎ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి!!

  • కొంతమంది కాపు ఉద్యమ నాయకుల అంత్యక్రియలు ఏనాడో పూర్తయ్యాయి కర్మకాండలే మిగిలి ఉన్నాయి
  • నెల్లూరుకి కొత్తగా వచ్చిన సాయన్న చిలక జోతిష్కాలయంలో భవిష్యత్తు సరిగా చెప్పడం లేదు
  • దేవుడికి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు నెల్లూరు సిటీ నారాయణ గారి క్యాంపెయిన్ జరుగుతుంది
  • 175 కాదు కానీ ప్రస్సూ భాయ్ ముందు కోవూరు నియోజకవర్గం గెలిచి చూపించు

నెల్లూరు సిటీ: జనసేన నాయకులు గునుకుల కిషోర్ బుధవారం నెల్లూరు సిటీ సుబేదారు పేట నందు గల వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమాయక కాపులను రెచ్చగొట్టి రిజర్వేషన్ల పేరుతో ఆత్మహత్యలకు ప్రేరేపించడమే కాక ప్రభుత్వాస్తులపై తెగబడి ఎన్నో తప్పులు చేయించి కేసులు పెట్టించిన ఉద్యమ నాయకులు ఏ పార్టీకైతే మద్దతుగా నిలిచారో ఆ పార్టీ తెగేసి వారి గడ్డపైనే రిజర్వేషన్లు కుదరదని చెప్పినప్పుడే వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ మధ్యకాలంలో మా కాపు పెద్దలు కర్మకాండలు కూడా చేయాలి లేకపోతే వారి ఆత్మలు ఘోషిస్తాయని చెప్తుంటే అది నేను నమ్మలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన నాయకుడిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. జూన్ 4 తర్వాత వారి కర్మకాండలు కూడా పూర్తి చేస్తాము.. మీరు ఏ రోజో వారికి దత్తత వెళ్లారు ఆ సంగతి మాకు ముందే తెలుసు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే వారు చేయక్కర్లేదు.. విజయ సాయి రెడ్డి గారు ఏదో పార్టీలు ఖాళీ అవుతున్నాయి ఇక పార్టీలో కనపడదు అని ఏదో చిలక జోస్యం చెబుతున్నారు. మీ చిలక జోస్యం భవిష్యత్తును సరిగా గుర్తించలేకుంది. ఎన్నికల ముందా నిండుకుండ లాగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లాలో తూట్లు పడ్డాయి.బయట పార్టీ నుంచి మీకు వస్తున్న నాయకులు ఒక గ్లాస్ అంత అయితే బయటకు పోతున్న నీరు చెంబులు చెంబులుగా ఉన్నాయి. కనబడకుండా పోయేది మీ నాయకులు మీ పార్టీని అని మీరు తెలుసుకోండి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పాత నాయకులు ఎవరూ సంచరించడం లేదనేది నిజం మీ ఓటమి కూడా తథ్యం.. నెల్లూరు సిటీలో నారాయణ గారి క్యాంపెయిన్ చూస్తుంటే దేవుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఉన్నాయి.. అడగందే అమ్మయినా పెట్టదు.. అలాటిది ఓట్లు అడగకుండానే ప్రజలు ఎవరూ వారిని కోరుకుండానే.. సిమెంట్ రోడ్లు, ఎల్ఇడి లైట్స్, అండర్ డ్రైనేజీ సిస్టం, మంచినీటి వసతులు కల్పించిన నారాయణ గారిని ప్రజల వారి ఇంటికి వచ్చే పలకరిస్తుంటే సంతోషంతో ప్రతి ఒక్కరి ఆనందంతో మా నాయకుడు మరలా వచ్చారని ఆనంద పడుతున్నారు. చేసిన తప్పు మరలా తిరిగి చేయమని ఈసారి నారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుపుతున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ గారి గెలుపు తథ్యం కొరవ మిగిలి ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసి స్మార్ట్ సిటీగా రూపుదిద్దుతానని.. ఇల్లు లేని పేదవారిని గెలవగానే తర్వాత పిలిచి మరీ ఇస్తానని ధైర్యంగా చెబుతున్న నారాయణ గారికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు.. 175 కు 175 గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రసన్న ముందు కోవూరులో మీ మీ సంగతి చూసుకోండి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థి భారీ విజయంతో గెలవనుంది. కుట్రలు పన్నింది కుతంత్రాలు చేసింది మీరు..పోటీ చేసేది మహిళ అని చూడకుండా మీరు పెట్టిన ప్రెస్మీట్లు మాట్లాడిన దుర్భాషలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం.. నెల్లూరు రూరల్ లో ప్రత్యర్థులు ఎంత డబ్బు కలవారైనా ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరించే శ్రీధర్ అన్న గెలుపు కూడా కాయం.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే యువత కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారి సూచనల తో యువతకు ఏదైతే ఉపాధి అవకాశాలు, మెగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటివి యువతకి ఎంతో ఉపయోగపడుతాయి.. ఈ రోజున ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో చూసినట్లయితే సమస్యలతో ఉన్న ప్రజలకు కచ్చితంగా ఊరట లబిస్తుంది. ముఖ్యంగా యువతకు ఏదైతే అవకాశాలు కల్పిస్తున్నారు వాటిని ఉపయోగించుకోవడానికి ఎన్ డి ఎ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టవలసిందిగా కోరుతున్నాము.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, మన్నేపల్లి బక్తవత్సలం, శ్రీను, షాజహాన్, శరవణ, బాలు, వర్షన్, మల్లీ, మధు, వాసు, ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.