రామకృష్ణారావు పేట ప్రజలతో ముత్తా శశిధర్

కాకినాడ సిటి, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ రామకృష్ణారావు పేటలోని వెదురు వృత్తి చేసుకునే వారి కుటుంబాలను కలిసి మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ వీరికుటుంబాలతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలని తెలుసుకున్నారు. వీరు ప్రస్తుతం చేతి వృత్తితో విడదీయలేని అనుబంధంతో ఇంకా కొనసాగిస్తున్నారనీ, దీనికి కావాలిసిన ముడి వెదురు మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ వారి ద్వారా కొంటేనే సబ్సిడీ ఇస్తారనీ, అసలే మొత్తం ముడి వెదురుని కాగితం మిల్లులకి సరఫరా చేస్తున్నారనీ, అరకొరగా లభ్యం అయ్యేది ఉన్నా కానీ సాంకేతిక సమస్యలవల్ల వేరే ఇతర కారణాల వల్ల సొమ్మురావట్లేదనీ, వచ్చినా చాలా కాలం పట్టడం జరుగుతోందనీ సదరు అమ్మకందారులు వీరికి అమ్మడానికి విముఖత చూపిస్తున్నారని చెప్పారు. ఈ కారణాలతో వీరు అస్సాం, ఒడిస్సా రాష్ట్రాలనుండీ సరుకు కొనుక్కుని తెచ్చుకుంటుంటే దీనిపై ప్రభుత్వం సబ్సిడీ రాయితీ ఇవ్వట్లేదనీ దీనివల్ల చాలా ఇబ్బందులు నష్టాన్నీ ఎదుర్కుంటున్నామని వాపోయారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ తమ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి వీరి సమస్యని తీసుకెల్తా అనీ, వేరే రాష్ట్రంలో సరుకు కొన్నా ఆ బిల్లులమీద సరుకు మొత్తానికి అర్హత ఉన్న సబ్సిడీని వచ్చేలా తగిన చర్యలు తీసుకునేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమిని బలపరిచి గెలిపించి సుపరిపాలన పొందుదామని పిలుపునిచ్చారు.