డ్రైనేజీ నీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు

  • సమస్యను పరిష్కరించకపోతే  ధర్నా చెయ్యడానికి కూడా సిద్దం
  • కదిరి జనసేన నాయకులు లక్ష్మణ కుటాల

కదిరి: పట్టణంలో శుక్రవారం కురిసిన వర్షానికి నల్లగుట్ట వీధి, కల్లంగడి వీధి (బాలాజీ స్ట్రీట్), జొన్న వీధి వంటి ప్రాంతాలలో వర్షపు నీరు మొత్తం నివాస గృహాల్లోకి చేరి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు కావడం చేత ఇండ్ల ముందు మోకాలి గాతం వరకూ వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనికి ప్రధాన కారణం సంవత్సరాల క్రితం కట్టిన కాలువలు చిన్నవిగా ఉండటం వల్ల ఆ ఉన్న ఆ కాలువల్లోనే పేరుకుపోయిన మట్టిని (పూడిక) సకాలంలో తీయకపోడం వల్ల ఆ మురుగు నీరు, వర్షపు నీరు మొత్తం ఇండల్లోకి వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్లకు, మునిసిపల్ అధికారులకు ఎన్ని సార్లు తమ గోడును చెప్పినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు తప్ప మా సమస్య పరిష్కారం గురించి మాత్రం పట్టించుకోలేదని చెప్తున్నారు. గడప గడపకు ఎమ్మెల్యే, అమ్మవడి వచ్చిందా, ఆసరా వచ్చిందా, రేషన్ వచ్చిందా అని అడుగుతున్నారు తప్ప మీకు రోడ్లు సక్రమంగా ఉన్నాయా, కాలువలు తీస్తున్నారా, మంచి నీరు వస్తోందా, ఇటువంటి సమస్యల గురించి అడిగిన పాపాన పోలేదని నమ్మి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఈ సమస్య తప్పదా అని ఆవేదన చెందుతున్నారు అక్కడ నివసించే ప్రజలు. ఇదే విషయాన్ని కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ భైరవప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కదిరి మునిసిపల్ కమిషనర్ కు పలుమార్లు సమస్య గురించి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇలాగే మీ తీరు ఉంటే స్థానిక ప్రజలతో మునిసిపల్ ఆఫీస్ ముందు ధర్నా చెయ్యడానికి కూడా సిద్దం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సత్వరమే సమస్యకు పరిష్కారం చూపిస్తారని కదిరి జనసేన పార్టీ తరపున మీకు తెలియజేస్తున్నాము అని జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ కుటాల కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ వాల్మీకి, దేవలం కార్తిక్, గిద్దలూరు అనిల్ తదితరులు పాల్గొన్నారు.