వారందరికీ ఉచిత విద్య అందించండి: ప్రభుత్వాలకు సోనూ సూద్ విజ్ఞప్తి

కరోనా కష్ట కాలంలో ఎంతో మంది నిరుపేదలకు సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా నిలిచిన సోనూ సూద్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి కుటుంబ పెద్దలను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సోనుసూద్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.