12న క్వాడ్‌ సదస్సు… పాల్గొననున్న ఆ నలుగురు దేశాధినేతలు

ఈ నెల 12న జరగనున్న క్వాడ్‌ సదస్సులో అగ్ర దేశాధి నేతలు భేటీ కానున్నారు. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ వర్చువల్‌గా ముఖాముఖి చర్చ జరపనున్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్‌ తొలిసారిగా ఈ సదస్సులో పాల్గొననున్నారు. క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారని ప్రకటించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ… ప్రాంతీయ, ప్రపంచ సమస్యలతో పాటు ఇండో- పసిఫిక్‌ ప్రాంతంపై నిర్వహణ, స్వేచ్ఛాయుత సహకారం వంటి ఆచరణాత్మక రంగాలపై తమ అభిప్రాయాలను… ఇతర దేశాధినేతలతో పంచుకుంటారని పేర్కొంది. సమకాలీన సవాళ్లైన… అభివృద్ధి చెందుతున్న, క్లిష్టమైన సాంకేతిక, మారిటైం భద్రత, వాతావరణ మార్పులు వంటి అంశాలపైైె ఈ నలుగురు అగ్ర దేశాధినేతలు చర్చించుకునేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. కోవిడ్‌-19 ఎదుర్కోవడంతో పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సురక్షితమైన, సరమైన ధరలకు వ్యాకిన్లను అందించేందుకు సహకారం కోసం అవకాశాలను అన్వేషించేందుకు నలుగురు దేశాధినేతలు చర్చించనున్నారు.