పెద్దబిడ్డ రేషన్ డిపో డీలర్ ను తొలగించండి: జనసేన వినతి పత్రం

అనంతగిరి: రేషన్ ఇవ్వని పెద్దబిడ్డ డిపో డీలర్ ను తోలగించాలని జనసేన మురళి మరియు అనంతగిరి ఎంపీపీ పెద్దబిడ్డ పంచాయతీ సర్పంచ్ లిఖితపూర్వకంగా తాసిల్దార్ కు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా అనంతగిరి మండల జనసేన నాయకులు జనసేన మురళి మాట్లాడుతూ గత రెండు నెలల నుండి ప్రజలకు బియ్యం ఇవ్వటం లేదు, ఆదివాసి బిడ్డలకు రేషన్ ఇవ్వకపోతే తిండి ఎక్కడ దొరుకుతుంది, కావున అధికారులు స్పందించి రేషన్ డీలర్ ని తొలగించి మరొక్క డీలర్ ని నియమించాలని గ్రామస్తులు మరియు జనసేన మురళి అలాగే రేషన్ డీలర్ పనితీరుపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతూ వస్తోందని మురళి అన్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద గిరిజనుల జనాభా ఎక్కువగా ఉంది, అయితే రేషన్ డీలర్ తప్పుడు నిర్ణయాలు గిరిజన పేద ప్రజలకు శకునిగా మారుతున్నాయి. రేషన్ సరుకులతో నెలంతా కడుపు నింపుకునే గిరిజన పేద ప్రజలు, గత రెండు నెలలుగా రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న కుటుంబాలకు రేషన్ ఇవ్వక, వారికి తీవ్ర అన్యాయానికి గురిచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి మన్యం ప్రాంతంలో ఉన్న గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.