జనసేనని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు : పోలిశెట్టి తేజ

మైలవరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల జ్వరంతో తీవ్ర అస్వస్థతకి గురైన సంగతి తెలిసినదే. ఆయన త్వరగా కోలుకోవాలని మరల ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజా సమస్యల పట్ల తన గొంతును వినిపించి మునుపటి లాగా రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో పాల్గొని రైతులకు మరియు సామాన్య ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ తుమ్మలపాలెం గ్రామ అభయాంజనేయస్వామి దేవస్థానంలో జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం అధ్యక్షులు మరియు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు తిరుమలశెట్టి పవన్, మోహన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.