ఇంటి వద్దకే ఆక్సిజన్… ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీలో కరోనా విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో కరోనా కల్లోలిత ప్రాంతాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. అయితే, కరోనా రోగుల్లో ఆక్సిజన్ వాడకం పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి ఆక్సిజన్ అవసరమైతే, ఇంటి వద్దకే అందించాలని నిర్ణయించింది.

ఐసోలేషన్ లో ఉంటూ ఆక్సిజన్ అవసరమైన వారు delhi.gov.in ప్రభుత్వ పోర్టల్ లో సీటీ స్కాన్, ఇతర నిర్ధారణలతో కూడిన కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ధ్రువీకరించబడిన ఫొటో ఐడీ కార్డు, ఆధార్ వివరాలు నమోదు చేస్తే ఇంటి వద్దకే ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తారు. ఈ వెసులుబాటు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేజ్రీవాల్ సర్కారు వెల్లడించింది.