తిరుమలకు పర్యటనకు రానున్న రాష్ట్రపతి

రేపు తిరుమల పర్యటనకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రేపు ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ముందుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటనతో తిరుమలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి విమానాశ్రయానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు.