బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలి: ప్రధాని మోదీ

దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఆయన ‘టాయ్‌ కాథోన్‌-2021’ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రపంచస్థాయి మార్కెట్‌ను సృష్టించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ అన్నారు.

జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేడు కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.