అద్యక్షుడిగా ట్రంపే కావాలి: ట్రంప్‌ మద్ధతుదారులు

వాషింగ్టన్‌లో ట్రంప్‌ మద్ధతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్‌ కోసం  ట్రంప్‌ మద్ధతుదారులు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌లో ఫ్రీడమ్‌ ప్లాజా వద్దకు వేలాదిగా చేరుకుని… అక్కడి నుంచి ర్యాలీ చేపట్టారు. ప్రౌడ్‌ బాయిస్‌ సంస్థ సభ్యులతో పాటు ఓత్‌ కీపర్స్‌ మిలిషియా గ్రూప్‌కి చెందిన వాళ్లు అమెరికా జాతీయ జెండాలను చేత పట్టుకొని నినాదాలు చేశారు. వీళ్లలో కొంత మంది హెల్మెట్లు, బులెట్‌ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి ర్యాలీలో పాల్గోడం విశేషం.

ఇక అమెరికా అధ్యక్షపదవికి సంబంధించిన తుది ఫలితాలు నిన్న వెలువడటంతో తుది ఫలితాల తరువాత ట్రంప్ స్వరం మారిపోయింది. అటు ఆరిజోనా ఎన్నికల ఫలితాలపై కోర్టుకు వెళ్ళాలని అనుకున్న ట్రంప్ వర్గం వెనక్కి తగ్గింది.కరోనా కంట్రోలింగ్ విషయంలో కొత్త వాళ్ళు చూసుకుంటారని ట్రంప్ చెప్పడంతో అయన మెత్తపడ్డారని తెలుస్తోంది. అయితే, చైనా విషయంలో మాత్రం ట్రంప్ వైఖరి ఏ మాత్రం మారలేదు. ఇప్పటికే అనేక చైనా కంపెనీలపై ఆంక్షలు విధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలపై ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు.