డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఎం.డి జనరల్ మెడిసిన్ జగనన్న కాలనీ పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీస్తూ జగనన్న మోసం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే నినాదంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా శనివారం పిఠాపురం నియోజకవర్గంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా టిడ్కో ఇల్లు వాటి యొక్క పాడైపోయినటువంటి ఇళ్లను పరిశీలించి ధర్నాను నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ # ట్యాగ్ ద్వారా జగనన్న మోసం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు ఈ కార్యక్రమం ద్వారా జగన్ ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇల్లు దాదాపు పూర్తయిపోయి చిన్నచిన్న పనులు దగ్గర ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ పేద ప్రజలకు ఇల్లు అందించిన పాపాన పోలేదు. ఈ నాలుగు సంవత్సరాలలో టిడ్కో ఇళ్లకు రంగులు వేశారు తప్పితే ఇచ్చిందేమీ లేదని లబ్ధిదారులకు మాత్రం బ్యాంకు నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి.. కానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు ఇస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉందని మూడు రాజధానులు అంటూ పబ్బం గడుపుతుంది తప్పితే.. కనీసం పేద ప్రజల కోసం ఆలోచించడం కూడా చేయట్లేదని.. రాష్ట్రమంతా 30 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించామని చెబుతుంది. ఈ ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 28 వేల మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టేసి అందిచ్చామని చెబుతుంది. ఈ ప్రభుత్వం అయితే ఈ ఇల్లు అన్ని ఎక్కడున్నాయి..? ఒకవేళ కడితే ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకెళ్లిపోయారా అంటూ డాక్టర్ శ్రీధర్ మీడియా ముందు మండిపడ్డారు. అదేవిధంగా మొన్న వైజాగ్ లో జరిగిన సంఘటన ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో రెండూ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మొన్న తగ్గాడు.. నిన్న సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎవరైతే పోలీసులు అవమానించారో.. ఎవరైతే పోలీసులు హోటల్లో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ల ద్వారానే వైజాగ్ లో రెడ్ కార్పెట్ వేయించుకుని వైజాగ్ నగరంలో అడుగు పెట్టాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. ఎవడ్రా మనల్ని ఆపేదని ఇప్పుడు చెబుతున్నా వైసిపి వాళ్లకు ఎవడ్రా మమ్మల్ని ఆపేది. ఇంకో విషయం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఇదే వైజాగ్ నగరానికి బాస్ ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెడతారని.. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటూ డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియా ముఖంగా ఫైర్ అవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా పులి మధు, మైనబత్తుల చిన్న, మనోహర్, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు గారు, బత్తిన వీరబాబు, పి శివ, కన్నబత్తుల రాజు, వకాపల్లి సూర్య ప్రకాష్, జీను శ్రీను గుర్రం గణేష్, మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.