బొంతు రాజేశ్వరరావుకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వినతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీచర్స్ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావుని కలిసి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించి రాష్ట్రంలో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేసి పెన్షన్, సౌకర్యాలు కల్పించాలిని వినతిపత్రం అందచేశారు. ఈ విషయం గురించి రాజేశ్వరరావు మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తాము. మీకు వచ్చే జనసేన-టిడిపి ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మేలు జరిగే విధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.