ఆస్ట్రేలియాలో మొదలైన వ్యాక్సినేషన్.. మొదటి టీకా ఆయనకే..

కాన్‌బెర్రా: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కూడా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. అయితే అక్కడ మొదటి టీకాను దేశ ప్రధాని స్కాట్ మొర్రిసన్ వేయించుకున్నారు. స్కాట్‌తో పాటు ఆరోగ్య శాఖ అధికారి పాల్ కెల్లితో సహా మరికొందరు ఆరోగ్య శాఖవారు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మొర్రిసన్ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజలకు తెలిపారు. ‘రేపటి నుంచి మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దానికి నాంది పలుకుతున్న వాడిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పనున్నాను. ఈ వ్యాక్సిన్ హానికరం కాదు. ఈ వ్యాక్సిన్ అందుకోవడం చాలా ముఖ్యం, మనం కరోనా మహమ్మారి సమయంలో కూడా మనకోసం కష్టపడిన వారికి ప్రముఖ ప్రాధాన్యతనిస్తూ వారితోనే ప్రారంభించాల’ని మొర్రిసన్ అన్నారు. అయితే ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో ధైర్యం నిపేందుకు ముందుగా రాజకీయవేత్తలకు వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకున్నామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీ నేతలు మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుకోనున్నారని కూడా తెలిపారు.